జనసేన భగత్ సింగ్ విద్యార్థి విభాగం నాయకులు మాలిశెట్టి మహేష్, గురు కళ్యాణ్ గారు ఒక ప్రకటన లో మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉంటే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖకత్వమేనని అన్నారు. పరీక్షలు నిర్వహించడం వల్ల లక్షల మంది విద్యార్థులనే కాదు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తుందని, సి.బి.ఎస్.ఈ. కూడా కేంద్రం రద్దు చేసి ప్రమోట్ చేసిందని, ఇప్పటికే మన రాష్ట్రంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతూ ప్రాణాలు పోతున్న పరిస్థితి రోజు పత్రికల్లో, మీడియాలో చూస్తూ ఉన్నామని, తక్షణమే 10వ తరగతి విద్యార్థులు 6.4 లక్షల మంది, ఇంటర్మీడియెట్ విద్యార్థులు 10.5 లక్షల మంది సుమారు గా 16 లక్షల మంది విద్యార్థులకు వెంటనే పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, భగత్ సింగ్ విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ సందీప్ పంచకర్ల గారు పిలుపు నిచ్చారన్నారు. కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు రక్షణగా ఉండాలని కోరారు. కరోణ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పరీక్షలు రద్దు చేయడం జరిగిందన్నారు. వసతి గృహాలు మూసివేసి పదవ,ఇంటర్ తరగతులు నిర్వహిస్తే పేద విద్యార్థులు నష్టపోతారని, అందరికీ సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి చర్చించి పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి గురు, ఇలియాస్, వంశీ, వెంకట్, సంతోష్, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.