Logo
Date of Publish : 23 February 2021, 8:47 am
Editor : Sake Naresh

కేతంరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం 4 మరియు 5 డివిజన్ల నుండి జనసేన పార్టీలో 100 మంది యువకుల చేరిక

            జనసేన సిద్ధాంతాలు,పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం బలపడుతోందని జనసేన నెల్లూరు నగర నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగర నియోజక వర్గంలోని 4 మరియు 5 డివిజన్లకు చెందిన 100మంది యువకులు కేతంరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. స్థానిక జాకీర్ హుస్సేన్ నగర్, సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారిని కేతంరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో.. క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలపై పోరాడుతున్నామని అన్నారు. ప్రజల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అవగాహన కలిగించి చైతన్య పరుస్తున్నామని అందుకే యువత జనసేన పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతోందని.. ఇప్పటి వరకు జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనం అని ఆయన అన్నారు.. రోజు రోజుకు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఆయన అన్నారు. రానున్న స్థానిక సంస్థల మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగించి ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకుపోతామని 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజక వర్గంలో జనసేన జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజెన్ని చంద్రశేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, సురేష్ నాయుడు, మోష, శ్రీపతి రాము, కుక్కా ప్రభాకర్, రేవంత్,హేమంత్ రాయల్, మహేష్, జీవన్, మహిళా నాయకులు ఇందిరా రెడ్డి, షేక్ ఆలియా, శిరీషా రెడ్డి, స్థానిక నాయకులు నాసిర్, హేమంత్, శశి, దావూద్, మనోజ్, గౌతమ్, ప్రదీప్, శ్రీను, మదన్, అభి, రవి, సాధిక్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com