
అనంతపురం ( జనస్వరం ):: జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఇటు వర్షపాతం లేక అటు భూగర్భ జలాలు ఇంకిపోతూ అనావృష్టితో కనీసం జిల్లాలో 90 శాతం రైతులు సంవత్సరానికి ఒక పంటకు నోచుకోలేక పోతున్నారని జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనాదిగా ఈ కరువు జిల్లాను పీడిస్తూ రైతులకు వ్యవసాయం కలసిరాక ఆకలిచావులతో, వలసలతో, కూలీలగానో, స్టోర్ బియ్యం పై ఆధారపడి అర్ధాకలితో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూ జిల్లా వెనకబాటుతనానికి గురవుతోందని అన్నారు. వీటన్నింటికి ఒకటే పరిష్కారం అనంతపురం జిల్లా వాటా కింద 100 TMC సాగు జలాలు అందించాలన్నారు. జనసేన పార్టీ తరపున జిల్లాలోని ప్రతి గ్రామం తిరిగి సాగుజలాలకై పోరాటం చేయదలచుకున్నామని అందుకు భవిష్యత్తు కార్యచారణ రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సాగుజలాలపై ఉపాధ్యాయులు 100 tmc రామాంజనేయులు గారు గత 15 సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారు. మేము కూడా జనసేన పార్టీ నుండి అనంతపురం జిల్లా కు 100 tmc సాగుజలాలు అందేంతవరకు ఉద్యమం చేయ తలపెట్టినామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీనివాస్, విశ్వనాథ్ జనసేన, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.