కర్నూలు ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తే ఏకంగా వారి అభిమానులు ట్రెండ్ ను ఫాలో అవుతారు. అది రాజకీయం, సినిమా,సామాజిక సేవా, ఏదైనా సరే ఫాలో కావడం మాత్రమే తెలుసని అంటారు. పవన్ అభిమానులు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 51 వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన కార్యకర్తలు కర్నూలు జిల్లా కేంద్రమైన వెంకటరమణ కాలని సమీపంలో కర్నూలు జిల్లా జనసేన నాయకులు పవన్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. అక్షయ బ్లడ్ బ్యాంక్ సొసైటీ వారికి దాదాపు 100 మందికి పైగా పాల్గొని రక్తదానం చేశారు. జనసేన పార్టీ కర్నూలు జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే గొప్ప మానవతా వాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం నిరంతరం సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సామాజిక సేవలో పాల్గొని తమవంతు కృషిచేస్తామని తమ నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com