అగ్రకులాలలోని పేదలకు కేంద్ర కేటాయించిన 10% శాతం ప్రభుత్వం (EWS) రేజర్వేషన్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తీసుకోరావాలని ఆళ్ళగడ్డ జనసేన పార్టీ నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్ చేసారు. అయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీగారు మంచి మనసుతో అగ్రవర్ణాలైన బ్రాహ్మణ, వైశ్య, కాపు(బలిజ), రెడ్డి, కమ్మ, క్షత్రియ, వెలమ కులాలలోని పేదలకోసం బిసి మైనారిటీ ఎస్సి,ఎస్టీ సోదరులకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ నష్టం కలగకుండా నరేంద్ర మోడీ గారు కల్పిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేయకపోవటం అగ్రవర్ణాల పేదలు విద్య ఉద్యోగాల్లోనూ రాకీయాల్లోను నష్టపోతున్నారని ముఖ్యంగా అగ్రవర్ణాల పేదల్లో కాపులు ఎక్కువ నష్టపోతున్నారని అన్నారు. ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన కాపుల ఓట్లతో గెలిచిన స్థానిక ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులూ వెంకటసుబ్బయ్య రాజారామ్ విజయ్ పాల్గొన్నారు.