
టెక్కలి ( జనస్వరం ) : టెక్కలిని యోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సుధీర్ మేడబోయిన, కోటేష్ పల్లి అధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ బలోపేతానికి జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని 3 రోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గం, కోటబొమ్మాళి మండలంలో కన్నేవలస పంచాయతీలో ప్రతి గడపకి వెళ్తు, పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో వివరించండం జరిగింది. ఈసారి ఎన్నికల్లో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ పై ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని కోరడం జరిగింది. జనంతో_జనసేన కార్యక్రమంలో టెక్కలి నియోజకవర్గ నాయకులు చందు పిల్లల, రమేష్ ఇలపండ, ఉదయ్ పట్నాయక్ , శ్రీను పట్నాయక్ , ప్రసాద్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.